Shaakuntalam Movie Collections | సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. మొదటి నుంచి వరుస ప్రమోషన్లు, ప్రీమియర్ షోలు గట్రా చేస్తూ చిత్రబృందం ఈ సినిమపై జనాల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ రావడం స్టార్ట్ అయింది. దాంతో మేకర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఇక రిలీజ్ తర్వాత కూడా అదే టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది.
తొలిరోజు ఈ సినిమా కేవలం రూ.2.2 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. మీడియం రేంజ్ ఈ సినిమాలకు ఈ స్థాయి కలెక్షన్లు డీసెంట్ అనిపించోచ్చు. కానీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన శాకుంతలంకు ఈ కలెక్షన్లు సరిపోవు. ఈ సినిమాకు దాదాపు రూ.18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే శాకుంతలం బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.16 కోట్ల వరకు రాబట్టా్ల్సి ఉంటుంది. ఇక శని, ఆదివారాల బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏదైనా మ్యాజిక్ తప్పతే మట్టుకు ఈ సినిమా గట్టెక్కడం ఖాయంగానే కనిపిస్తుంది.