విజువల్ వండర్‌గా ‘శాకుంతలం’
సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్నిదర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. త్రీడీ ఫార్మేట్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది.
సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్నిదర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. త్రీడీ ఫార్మేట్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నీలిమ గుణ మాట్లాడుతూ…‘త్రీడీ ఫార్మేట్లో వస్తున్న తొలి పౌరాణిక నేపథ్య చిత్రమిదే. త్రీడీలోకి సినిమాను మార్చాలనే ఆలోచన దిల్ రాజుది.
మా సినిమాలోని అందమైన విజువల్స్ త్రీడీ వల్ల మరింత బ్యూటిఫుల్‌గా మారాయి. మా చిత్రాన్ని చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘తెలుగు సినిమా ప్రపంచఖ్యాతిని పొందుతున్నది. ఇలాంటి సమయంలో శాకుంతలం వంటి సినిమా రావడం సంతోషకరం. ఒక గొప్ప సినిమాలో నేనూ ఉండాలని నిర్మాణంలో భాగమయ్యాను. ఇలాంటి సినిమా చేస్తే వీఎఫ్ఎక్స్, ఇతర విషయాల్లో ఎంతో నేర్చుకోవచ్చు అని భావించాను. తెలుగు సినిమాలను మనం ప్రపంచానికి చూపిస్తూనే ఉండాలి. ఆక్రమంలో నా తొలి అడుగు శాకుంతలం. విజువల్ వండర్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అన్నారు. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ…‘శకుంతల పాత్రకు ప్రాణం పెట్టి ప్రాణప్రతిష్ట చేశారు సమంత. ఈ పాత్ర కోసమే ఆమె పుట్టారా అనిపిస్తుంది. సినిమా విడుదలయ్యాక మీరు చెప్పే మాటలు వినాలని అనుకుంటున్నాను. శాకుంతలం కథను సినిమా కోసం మార్చలేదు. 90 శాతం ఆ కథనే ఆనుసరించాం. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్స్ ఉండటం వల్లే ఇంత భారీ ప్రయత్నాలు చేయగలుగుతున్నాం’
అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

