ఫ్యాన్స్‌కు షాక్.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు సర్జరీ..
Krishnamraju | కొన్ని రోజులుగా సీనియర్ నటుడు, హీరో ప్రభాస్ ( Prabhas ) పెదనాన్న కృష్ణంరాజు బయటికి రావడం లేదు. ఆ మధ్య రాధే శ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించినా కూడా కుర్చీకి మాత్రమే పరిమితం అయ్యారు. అప్పుడు ఆయనకు ఏమైంది అని చాలా మంది అభిమానులు ఆరా తీశారు. అయితే వయసు రీత్యా ఆయన నిలబడలేకపోతున్నారు.. అందుకే కుర్చీలో కూర్చోబెట్టారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ దానికి కారణం అది కాదు గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయనకు జరిగిన ప్రమాదం కారణమని ఇప్పుడు తెలుస్తోంది. కొన్ని నెలల కింద ఆయన తన ఇంట్లో బాత్రూంలో జారి పడటంతో.. ఆయనకు చిన్న శస్త్రచికిత్స జరిగింది. తర్వాత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. అయితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు మరోసారి సర్జరీ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. అప్పుడు జరిగిన గాయానికి సంబంధించి చిన్న సర్జరీ ఒకటి చేయాల్సి వచ్చిందని.. అపోలో వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణంరాజు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అంటున్నారు సన్నిహితులు. అయితే ఈ శస్త్రచికిత్సలో భాగంగా ఆయన కాలివేలు ఒకటి తీసేయాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కొన్నేళ్లుగా వయోభారంతో ఆయన సినిమాలు చేయడం లేదు.
కేవలం ప్రభాస్ హీరోగా నటించిన రెబల్, బిల్లా సినిమాల్లో అతిథి పాత్రల్లో మాత్రమే కనిపించారు. తాజాగా విడుదలకు సిద్ధమైన రాధే శ్యామ్ సినిమాలో కూడా పరమహంసగా కనిపించారు కృష్ణంరాజు. ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెబెల్ స్టార్ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Krishnamraju
- Prabhas
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

