Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కల్యాణ్ అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశాడు హరీష్ శంకర్.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అలనాటి హీరోయిన్, అందాల నటి గౌతమి Gautami కీ రోల్లో మెరువనుందట. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం, సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది గౌతమి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్‌లో కనిపించబోతుందా..? అనే దానిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే గౌతమిని హరీష్ శంకర్ ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారనుంది.
ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ గ్లింప్స్ వీడియోలో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నెట్టింట ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది గ్లింప్స్.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..