సీనియర్ నటి జయలలిత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. జయలలిత సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవల సెన్సారును పూర్తిచేసుకుంది. ఆగస్టు నెలలో స్క్రీన్ మ్యాక్స్ సంస్థ ద్వారా విడుదల కానుంది.
నిర్మాత మాట్లాడుతూ ‘శశ్మాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం’ అన్నారు. ఆలేఖ్య, బాచి, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి.