చిరంజీవి అర్జునుడైతే, అల్లు అరవింద్ శ్రీకృష్ణుడు.. మెగాస్టార్‌పై చంద్రమోహన్ వ్యాఖ్యలు..!
సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బీ.ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన 'రంగుల రాట్నం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు చంద్రమోహన్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నాడు.
Senior Actor Chadra Mohan | సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బీ.ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగుల రాట్నం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు చంద్రమోహన్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే గత నాలుగేళ్లుగా చంద్రమోహన్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చివరిగా ఈయన గోపిచంద్ హీరోగా చేసిన ‘ఆక్సిజన్’ సినిమాలో నటించాడు. ఈ సినిమా తర్వాత బయట కూడా ఎక్కువగా కనిపించలేదు. కాగా తాజాగా ఈయన ఓ ఇంటర్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇంటర్వూలో భాగంగా చంద్రమోహన్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవితో పనిచేయడం గురించి పలు విషయాలు చెప్పాడు. చిరంజీవి మొదటి సినిమా నుండి ఆయనతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పాడు. ‘ప్రాణం ఖరీదు’ సినిమా టైమ్‌లో చిరంజీవి రఫ్‌గా ఉండేవాడని, ఆర్టిస్టు అవ్వాలని తపన ఉండేదని తెలిపాడు. అంతేకాకుండా అప్పట్లో డ్యాన్స్‌లు తను మాత్రమే చేశానని, ఆ తర్వాత చిరంజీవి తన ఓన్ స్టైల్లో డ్యాన్స్ చేసేవాడని చెప్పుకొచ్చాడు. చిరంజీవిని అర్జునుడితో పోలుస్తూ.. శ్రీ కృష్ణుడు లేనిదే అర్జునుడు లేడని, అదే విధంగా అల్లు అరవింద్ లేనిదే చిరంజీవి లేడని అరవింద్‌ను కృష్ణుడితో పోల్చాడు. చిరంజీవికి మేయిన్ గైడెన్స్ అల్లు అరవింద్ అని తెలిపాడు. అంతేకాకుండా అల్లు అరవింద్ లాంటి వారు తనకు కూడా ఉంటే కెరీర్ అద్భుతంగా ఉండేదని చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

