Selvaraghavan | చిరంజీవిగా సెల్వారాఘవన్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్‌లుక్ పోస్టర్
సెల్వారాఘవన్ పేరు తెలుగు వారికి తొందరగా గుర్తురాదు కానీ శ్రీరాఘవ అంటే చాలా మంది గుర్తుపడతారు. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', '7G బృందావన్ కాలనీ', 'యుగానికి ఒక్కడు' వంటి అద్భుతమైన చిత్రాలకు సెల్వా దర్శకత్వం వహించాడు.
Selvaraghavan as Chiranjeevi | సెల్వారాఘవన్ పేరు తెలుగు వారికి తొందరగా గుర్తురాదు కానీ శ్రీరాఘవ అంటే చాలా మంది గుర్తుపడతారు. ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘7G బృందావన్ కాలనీ’, ‘యుగానికి ఒక్కడు’ వంటి అద్భుతమైన చిత్రాలకు సెల్వా దర్శకత్వం వహించాడు. తెలుగులో ఆయనను శ్రీరాఘవ అని పిలుస్తుంటారు. దర్శకుడిగా తన ప్రతిభ ఏ స్థాయిదో నిరూపించిన సెల్వా ఈ మధ్య నటుడిగా మారి తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాడు. అందుకు నిదర్శనం ఇటీవలే వచ్చిన చిన్ని మూవీ. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సెల్వా, కీర్తికి అన్నగా నటించాడు. ఈ సినిమాలో సెల్వా నటన వర్ణనాతీతం. ఓ వైపు చెల్లికి అన్యాయం చేసిన వారిని హతమారుస్తూనే మరోవైపు చెల్లికి అండగా నిలబడే క్యారెక్టర్లో జీవించేశాడు.
ఇదిలా ఉంటే సెల్వా పుట్టిన రోజు సందర్భంగా మార్క్ ఆంటోని సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. గుబురు జుట్టుతో ఎరుపురంగు కళ్లద్దాలతో 80వ దశకాన్ని తలపించేలా సెల్వా పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమాలో సెల్వా చిరంజీవి పాత్రలో కనిపించనున్నాడు. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
Happy Birthday Chiranjeevi @selvaraghavan from the world of #MarkAntony pic.twitter.com/v6Mi6PxBOS
— Vishal (@VishalKOfficial) March 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

