శేఖర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్న రాజశేఖర్

వెండితెరపై యాంగ్రీ యంగ్‌మెన్‌గా కనిపించి ప్రేక్షకులకి పసందైన వినోదం అందించిన స్టార్ నటుడు రాజశేఖర్. పవర్ ఫుల్ పాత్రలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన రాజశేఖర్ మధ్యలో తన నటనకు పాజ్ ఇచ్చాడు. గరుడ వేగ చిత్రంతో రీఎంట్రీ మంచి విజయాన్ని సాధించాడు. ఇక వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న రాజశేఖర్ ఆ మధ్య కరోనా బారిన పడి కోలుకున్నాడు.
రాజశేఖర్ కిట్టీలో ప్రస్తుతం చాలా సినిమాలే ఉన్నట్టు తెలుస్తుంది. ‘మర్మాణువు, శేఖర్’తో పాటు మరో సినిమా ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. దీనితో పాటే రాజశేఖర్ ఓ తమిళ సినిమాలోనూ కీలక పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.గోపిచంద్ 30వ చిత్రంలోను రాజశేఖర్ ఓ పాత్ర చేయనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే రాజశేఖర్ చేయనున్న శేఖర్ సినిమాపై అందరిలో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.
రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శేఖర్ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ షేర్ చేశారు. పోస్టర్లో తెల్ల గెడ్డంతో రఫ్‌లుక్‌లో ఉన్న రాజశేఖర్ ఫొటోను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. ఇది సగం ఫొటోనే అయినా ఈ లుక్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. రాజశేఖర్ కెరీర్లో 91వ సినిమాగా ఈ ‘శేఖర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా, తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
లలిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ బాణీలు కట్టబోతున్నారు. ఇందులో రాజశేఖర్ విశ్రాంత పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. కరోనాకు ముందు చిత్ర షూటింగ్ మొదలు కాగా, లాక్డౌన్ వలన మేకర్స్ బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ రోజు చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్ బ్యాక్ లుక్ మాత్రమే రివీల్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Rajasekhar
- sekhar
- Shooting
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

