Sehari on OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న సెహరి.. విడుదల ఎప్పుడంటే?
ehari movie on OTT | హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన చిత్రం సెహరి. జ్ఞానసాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణురెడ్డి నిర్మించాడు.
Sehari movie on OTT | హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణురెడ్డి నిర్మించాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ బాలకృష్ణ విడుదల చేశాడు. అప్పటి నుండి సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపైన మంచి అంచనాలనే పెంచాయి. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షోనుంచే పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కానీ పోటీగా రవితేజ ఖిలాడీ, డిజే టిల్లు సినిమాలు ఉండటంతో కలెక్షన్లకు తీవ్ర స్థాయిలో దెబ్బపడింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రీలీజ్‌ను ప్రకటించారు.
సెహరి చిత్రం థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఫిబ్రవరి 25నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి హర్ష్ స్వయంగా కథను అందించాడు. అభినవ్ గౌతమ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు.
1 Boy 👨, 3 Girls 👱🏻♀️👩🦳👩🏻, 1 Story 📖. Neither triangle nor quadrangular, Mari intaki e love story ento, aa sehari ento. Teluskondi. Vacchesthundi ga Feb25th #SehariOnAha@HarshKanumilli @SimranCOfficial @gnanasagardwara @prashanthvihari @PicturesVirgo #AdvayaJishnuReddy pic.twitter.com/O1QFtgoPvF
— ahavideoin (@ahavideoIN) February 18, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

