స్వయంగా వంట చేసుకున్నా!

“టాక్సీవాలా’ తర్వాత దాదాపు ఇరవై ఐదు కథలు విన్నా. మంచి సినిమా చేయాలనే ఆలోచనతో రెండేళ్లు విరామం తీసుకున్నా’ అని తెలిపింది ప్రియాంక జవాల్కర్. ఆమె కథానాయికగా నటించిన ‘తిమ్మరుసు’, ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ చిత్రాలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రియాంక జవాల్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ “తిమ్మరుసు’లో లాయర్‌గా పరిణతితో కూడిన నటనను కనబరిచానని చెబుతున్నారు. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించినా వసూళ్లు మాత్రం బాగున్నాయి. రాయలసీమ ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటున్నది. ‘తిమ్మరుసు’లో చాలా బొద్దుగా కనిపించాననే కామెంట్స్ వినిపించాయి. కెరీర్‌ను నేను నిర్లక్ష్యం చేస్తున్నానంటూ విమర్శలొచ్చాయి. థైరాయిడ్ సమస్యల వల్ల బరువు పెరిగాను. డాక్టర్స్ సలహాలు తీసుకుంటూ కష్టపడి ఫుడ్ కంట్రోల్‌తో పాటు వర్కవుట్స్ ద్వారా బరువు తగ్గా. నేనే స్వయంగా వంట చేసుకున్నా . నటనా పరంగా నేను చేసిన తప్పొప్పుల్ని స్నేహితుల ద్వారా తెలుసుకుంటా. సినిమా పూర్తయిన తర్వాత స్క్రీన్‌పై చూసుకుంటే నాకు అన్నీ తప్పులే కనిపిస్తాయి. స్వీయ విశ్లేషణ చేసుకునే పరిణతి నాకు ఇంకా రాలేదు. ‘గమనం’ సినిమాలో నటనకు ఆస్కారమున్న పాత్ర చేశా. తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

