అందాల హద్దు దాటను!

‘కల్మషం లేని మనసే అంతఃసౌందర్యాన్ని ప్రతిఫలిస్తుంది. బాహ్యరూపం ఎంత గొప్పగా ఉన్నా అది అసలైన అందం కాదు. మనల్ని మనం యథాలాపంగా స్వీకరించడమే నిజమైన అందానికి నిర్వచనం’ అని చెప్పింది రుహానీశర్మ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. దిల్‌రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్,రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ నెల 3న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో రుహానీశర్మ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నా పాత్ర ప్రధానంగానే ఈ సినిమా సాగుతుంది. బట్టతలతో బాధపడే ఓ యువకుడి కథ ఇది. తన సమస్యను దాచిపెట్టే క్రమంలో అతడెలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఓ అమ్మాయితో పరిచయం అతడి ఆలోచనధోరణిలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? నిజమైన అందానికి అర్థం ఎలా తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. హద్దులు దాటిన అందాల ప్రదర్శనకు నేను వ్యతిరేకం. అలాంటి పాత్రలు చేయను. ప్రస్తుతం తెలుగులో హీరో నాని నిర్మాణంలో రూపొందుతున్న ‘మీట్‌క్యూట్’లో నటిస్తున్నా. అలాగే ఈరోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఓ అంథాలజీ చిత్రం చేస్తున్నా. వ్యక్తిగతంగా లవ్‌స్టోరీస్‌ను ఇష్టపడతాను. సైకో థ్రిల్లర్ సినిమాలు చేయాలనుంది’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

