Sayaji Shinde | నేను బాగానే ఉన్నాను.. హెల్త్‌పై క్లారిటీ ఇచ్చిన సాయాజీ షిండే
Sayaji Shinde | విలక్షణ నటుడు.. కిక్ సినిమా ఫేమ్ సాయాజీ షిండే() అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. సాయాజీకి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈసీజీలో మార్పులు కనిపించాయి.
Sayaji Shinde | విలక్షణ నటుడు.. కిక్ సినిమా ఫేమ్ సాయాజీ షిండే (Sayaji shinde) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. సాయాజీకి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈసీజీలో మార్పులు కనిపించాయి. దాంతో, యాంజియోగ్రఫీ పరీక్షకు వైద్యులు సిఫారసు చేశారు. సాయాజీ షిండేకు గుండె కుడివైపున 99 శాతం బ్లాక్స్ ఉన్నట్టు ఆ పరీక్షలో వెల్లడైంది. దాంతో ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని కూడా డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలని సందేశాలు పెడుతున్నారు.
అయితే అభిమానులు అందోళన పడుతుండటంతో సాయాజీ షిండే తాను ఇప్పుడు బాగున్నట్లు స్వయంగా ఒక వీడియోను విడుదల చేశాడు. నేను బాగానే ఉన్నాను. కంగారు పడకండి. నన్ను ప్రేమించే అభిమానులు, శ్రేయోభిలాషులు నావెంట ఉన్నంతవరకు నాకు ఏమీ జరగదు. త్వరలోనే మళ్లీ మీ అందరికీ వినోదం పంచడానికి వస్తాను అంటూ సాయాజీ చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

