Save the Tigers | వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3లో సేవ్ ది టైగర్స్.. మూడో సీజన్ ఆన్ ది వే..!
Save the Tigers |మహి వి రాఘవ్ (Mahi V Raghav) కాంపౌండ్ నుంచి వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సేవ్ ది టైగర్స్ (Save the Tigers) సీజన్ 1, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ షోలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అందరికీ కనెక్ట్ అవుతూ.. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో ఈ సిరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Save the Tigers | టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ్ ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో సక్సెస్ ట్రాక్‌లో వెళ్తున్నాడు. ప్రదీప్ అద్వైతం రచనలో మహి వి రాఘవ్ (Mahi V Raghav) కాంపౌండ్ నుంచి వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సేవ్ ది టైగర్స్ (Save the Tigers) సీజన్ 1, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ షోలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అందరికీ కనెక్ట్ అవుతూ.. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో ఈ సిరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
సేవ్ ది టైగర్స్ ఇండియాలోనే అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో నిలిచింది. ఈ అరుదైన ఫీట్ సాధించడం పట్ల షో రన్నర్ మహి వి.రాఘవ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను ఎక్కువగా చూసి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు.

పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి విజయాలను సాధిస్తాయని దీంతో రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరిందన్నాడు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సీజన్ 2 షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో.. దీనికి కొనసాగింపుగా సీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వారి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే సదరు రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామన్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

