సౌరభ్‌దింగ్ర, అఖిల్ సార్ధక్, అనిక్క విక్రమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌టైం’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో హేమంత్ ఇప్పలపల్లి రూపొందిస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ను కథానాయిక పాయల్ రాజ్‌పుత్ విడుదల చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, మన దేశానికి సంబంధించిన సాంస్కృతిక మూలాలను ఈ చిత్రంలో చూపించబోతున్నామని దర్శకనిర్మాత హేమంత్ తెలిపారు.
హైరేంజ్ గ్రాఫిక్స్‌తో ఈ సినిమా అలరిస్తుందని హీరో సౌరభ్‌దింగ్ర చెప్పారు. మైమ్ గోపి, శివ, భూపాల్‌రాజు, గాయత్రి గుప్త తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్, రామ్, సంగీతం: వెంకట్ అండ్ సూరజ్ ఎస్ కురుప్.