సత్యదేవ్ కథానాయకుడిగా ఓల్డ్ టౌన్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. సత్యదేవ్ నటిస్తున్న 26వ చిత్రమిది. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కబోతున్నది. కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ సత్యదేవ్తో పాటు నటించనున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇతర వివరాలను మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మణికంఠన్ కృష్ణమాచారి, సంగీతం : చరణ్ రాజ్.