SS Rajamouli | కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ కావాలి: దర్శకుడు రాజమౌళి
‘కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. టీజర్, ట్రైలర్ తక్కువ షాట్స్‌లోనే ఎట్రాక్టివ్‌గా తీసి, సినిమా చూడాలనే ఉత్సాహాన్ని పెంచాడు దర్శకుడు గోపాలకృష్ణ. సరైన సినిమా పడితే స్టార్ అయ్యేంత మంచి నటుడు సత్యదేవ్.
SS Rajamouli | ‘కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. టీజర్, ట్రైలర్ తక్కువ షాట్స్‌లోనే ఎట్రాక్టివ్‌గా తీసి, సినిమా చూడాలనే ఉత్సాహాన్ని పెంచాడు దర్శకుడు గోపాలకృష్ణ. సరైన సినిమా పడితే స్టార్ అయ్యేంత మంచి నటుడు సత్యదేవ్. ‘కృష్ణమ్మ’తో అది జరగాలని కోరుకుంటున్నా.’ అని దిగ్ధర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’ . వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అతిథిగా హాజరైన రాజమౌళి పై విధంగా స్పందించారు. దర్శకులు మలినేని గోపీచంద్, అనీల్ రావిపూడి కూడా అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
ఈ చిత్ర సమర్పకుడైన దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘కథ వినగానే ఈ ప్రాజెక్ట్‌లో నేనూ భాగం కావాలని అనిపించింది. అంత మంచి కథ. అందుకే నేను సమర్పకుడ్నయ్యా. గోపాలకృష్ణ చక్కగా తీశాడు. సత్యదేవ్ మంచి నటుడని రుజువు చేసే సినిమా ఇది. సాంకేతికంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ తన ప్రయాణంలో ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఈ సినిమాలో కూడా అన్ని మలుపులు ఉంటాయని, కథ వినగానే ఇది వందకోట్ల కంటెంట్ ఉన్న సినిమా అనిపించిందని, అదే దర్శకుడికి చెప్పానని, ఈ సినిమాకు అన్నీ బాగా కుదిరాయని, అందరికీ నచ్చుతుందని సత్యదేవ్ చెప్పారు. ఇంకా చిత్రయూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

