సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘రా అండ్ రస్టిక్ మూవీ ఇది. ఈ కథలో స్నేహానికి ఉన్న విలువను చూపిస్తున్నాం. సత్యదేవ్ పాత్ర చిత్రణ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా ఉంటాయి. రియలిస్టిక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. అతీరారాజ్, లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: కాలభైరవ, సమర్పణ: కొరటాల శివ, నిర్మాణ సంస్థ: అరుణాచల క్రియేషన్స్, దర్శకత్వం: వి.వి.గోపాలకృష్ణ.