Krishnamma | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సత్యదేవ్ ‘కృష్ణమ్మ’.. విడుదల ఎప్పుడంటే?
Krishnamma Movie | తెలుగు యువ హీరో సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). ఈ సినిమాకు వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు.
Krishnamma Movie | హీరో సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). ఈ సినిమాకు వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల తేదీ ప్రకటించారు.
ఈ సినిమాను మే 03న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా యూట్యూబ్ వేదికగా ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో సత్యదేవ్ జైల్లో ఉండగా భద్ర.. రిలీజ్ అవ్వబోతున్నాం రా అంటూ అవతలి వ్యక్తి అంటాడు.. సత్యదేవ్ ఎప్పుడు అంటూ విడుదల తేదీని ప్రకటించాడు. అతిరా రాజీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. కృష్ణనది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితుల కథ ఈ సినిమా. ఈ ముగ్గురికి ఓ విలన్‌కు మధ్య జరిగే గొడవే ‘కృష్ణమ్మ’. వీరి మధ్య జరిగిన ఓ ఘటన వారి ముగ్గురి జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

