సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పణలో వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఇన్టెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన టీజర్‌కు, సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
కథలోని మెయిన్ సోల్‌ను తెలియజేసేలా వున్న ‘కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం’ అంటూ సాగే ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వుంటుంది’అన్నారు.