హమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా నటించిన టీనేజ్ ప్రేమకథ ‘సత్య’. వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శివ మల్లాల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకులు సతీశ్ వేగేశ్న, మధుర శ్రీధర్, కృష్ణ చైతన్య, పవన్ సాధినేని, అర్జున్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఒక జర్నలిస్ట్‌గా రివ్యూ ఇద్దామని సినిమా చూశా. దీన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలి అనిపించి నిర్మాతగా మారాను’ అని శివ మల్లాల అన్నారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు.