నాన్నకోసం ప్రయాణం..
అమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా నటించిన చిత్రం ‘సత్య’. వాలీ మోహన్‌దాస్ దర్శకుడు. ఫొటో జర్నలిస్ట్ శివ మల్లాల శివమ్ మీడియా పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెలుగుప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది.
అమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా నటించిన చిత్రం ‘సత్య’. వాలీ మోహన్‌దాస్ దర్శకుడు. ఫొటో జర్నలిస్ట్ శివ మల్లాల శివమ్ మీడియా పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెలుగుప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ని, పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ ‘అందరు పిల్లలూ నాన్న మనకేం ఇచ్చాడు అని ఆలోచిస్తారు. కానీ నా సినిమాలో హీరో మాత్రం తను నాన్నకి ఏవన్నా ఇవ్వాలని కోరుకుంటాడు. నాన్నకోసం ప్రయాణం మొదలుపెడతాడు. ఈ సినిమాను చాలామంది నిర్మాతలు తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నించినా, సతీశ్‌గారు నాకిచ్చిన మాటకు కట్టుబడి నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చారు. నిర్మాతగా నా ప్రయాణం ఈ సినిమాతో మొదలైంది. ఇకనుంచి నా సంస్థనుంచి మంచి సినిమాలే వస్తాయి’ అన్నారు.
తమిళంలో ‘రంగోలి’ పేరుతో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యిందని, తెలుగులో కూడా ఘనవిజయం సాధించడం ఖాయమని, ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్న శివ కచ్చితంగా నిర్మాతగా సక్సెస్ అవుతాడని తమిళ వెర్షన్ నిర్మాత సతీశ్ నమ్మకం వెలిబుచ్చారు. ‘సత్య’ నా కెరీర్లోనే స్పెషల్ మూవీ. ఎందుకంటే దర్శకుడిగా నాకిది తొలి సినిమా. ఇలాంటి మంచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరవకావడం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్‌తోపాటు. జర్నలిస్టులు ప్రభు, టీవీ9 లక్ష్మీనారాయణ, సినీజోష్ రాంబాబు, బీఏ రాజు శివ, తదితరులు మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

