సాత్విక్‌వర్మ, జాక్ రాబిన్సన్, మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చిక్లెట్స్’. ముత్తు. యం దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తల్లిదండ్రులందరూ పిల్లల కెరీర్ గురించే ఆలోచిస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులంటే ప్రేమాభిమానాలతో ఉంటారు. అయితే వారికి ఓ వయసు వచ్చాక పేరేంట్స్‌తో విభేదించ డం మొదలుపెడతా రు. అంతిమంగా పిల్లలకు ధైర్యాన్నిచ్చి ప్రయోజకుల్ని చేసేది తల్లిదండ్రులే అనే అంశాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. సెంటిమెంట్‌తో పాటు సందేశం కూడా ఉంటుంది’ అన్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కొల్లంజి కుమార్, సంగీతం: బాల మురళి బాలు.