khiladi movie | ఒక సినిమా విడుదలయ్యాక ..బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చిపెడితే ఆయా నిర్మాతలు చిత్ర యూనిట్ సభ్యులకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇలా ఇప్పటికే తెలుగులో చాలామంది నిర్మాతలు తమ డైరెక్టర్లకు బహుమతులు ఇచ్చారు. తాజాగా ఒక టాలీవుడ్ నిర్మాత మాత్రం సినిమా ఇంకా విడుదల కాకముందే దర్శకుడి కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంతకీ ఎవరా నిర్మాత అని అనుకుంటున్నారా.. మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ఖిలాడి సినిమా నిర్మాత సత్యనారాయణ.
ఖిలాడి సినిమాకు రాక్షసుడు ఫేం రమేశ్ వర్మ దర్శకుడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ క్రమంలో సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకానికి భారీ మొత్తానికి డీల్ కుదరిందని సమాచారం. ఖిలాడి సినిమా రైట్స్‌కు భారీ ఆఫర్ రావడంతో.. డైరెక్టర్ రమేశ్ వర్మకు ఖరీదైన బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు ప్రొడ్యూసర్. దీంతో కోటి 20 లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ వెలర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. అవుట్‌పుట్ అద్భుతంగా రావడం వల్లనే.. సినిమా విడుదలకు ముందే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడని ఇప్పుడు టాలీవుడ్లో టాక్. ఇక ఖిలాడి సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.