Arabia Kadali | తండేల్ కథతో వెబ్ సిరీస్.. ఇంట్రెస్టింగ్గా ‘అరేబియా కడలి’ ట్రైలర్
Arabia Kadali On Prime |అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ (Thandel) చిత్రం సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
Arabia Kadali On Prime |అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ చిత్రం సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాలర్లు చేపల వేటకోసమని గుజరాత్ వెళ్లి అక్కడ అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. అక్కడ నుంచి వారు ఎలా బయటపడ్డారు, వారికి ఎదురైన సవాళ్లు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇదే కథతో తాజాగా ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్‌లో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
‘అరేబియా కడలి’ (Arabia Kadali) అంటూ రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌కి సూర్యకుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కథా రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తుండగా.. సత్యదేవ్‌తో పాటు, ఆనంది, నాసర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష రోషన్, ప్రత్యూష సాధు, కోట జయరామ్, వంశీ కృష్ణ, భరత్ భాటియా, చంద్ర ప్రతాప్ ఠాకూర్, డానిష్ భట్, రవి వర్మ, అమిత్ తివారీ, నిహార్ పాండ్యా, అలోక్ జైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 8, 2025 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటూ తండేల్ సినిమాలానే కొడుతుంది.
అయితే దీనిపై మేకర్స్ స్పందిస్తూ.. ‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్ షూటింగ్ 2024 లో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ఇదే కథాంశంతో కొన్ని సినిమాలు వచ్చినా, ‘అరేబియా కడలి’ కథ మాత్రం పూర్తిగా కొత్తది, అసలైనది అని మేకర్స్ స్పష్టం చేశారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

