Sasivadane Movie | ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శశివదనే. కోమలీ ప్రసాద్ కథనాయికగా నటిస్తుంది. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కుతుండగా.. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ గమనిస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన లవ్ స్టోరీ అని తెలుస్తుంది. హీరో – హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్ ఎండింగ్లో రక్షిత్ లుక్ చూస్తుంటే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2000 నుంచి 2010 బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరోవైపు శశివదనే విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
రఘు కుంచె, ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో పోషిస్తుండగా.. గౌరీ నాయుడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్, ఏజీ ఫిలిం కంపెనీతో కలిసి అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.