Sarkaruvari pata movie | సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, బర్త్‌డే బ్లాస్టర్ అంటూ విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ పాటను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో పాటకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో కీర్తిసురేష్ పై మహేష్ బాబు తలవాల్చిన ఫోటోతో పాటు కళావతి సాంగ్ ఆన్ ఫిబ్రవరి14.. అని ఉంది. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, సంస్ధలతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
The Classical Melody #Kalaavathi will strum your heart strings ♥️ #SVPFirstSingle will join your playlists on FEB 14 🎶#SarkaruVaariPaata#SVPOnMay12
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/J9O1RJYPmh
— Vamsi Kaka (@vamsikaka) February 9, 2022