Sarkaru Vaari Paata Title Song | ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ విడుదల.. మరోసారి ఆకట్టుకున్న థమన్ మ్యూజిక్
Sarkaru Vaari Paata Title Song | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. మహేష్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. గీతా గోవిందం ఫేం పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి సినిమాపైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను హరిక నారాయణ్ ఆలిపించింది. తమన్ ఎప్పటిలాగానే ఈ పాటకు మాస్ ట్యూన్‌తో అదరగొట్టాడు. ఇప్పటివరకు మహేష్ కెరీర్లో టైటిల్ సాంగ్స్ అంటే ‘నీ దూకుడు’, ‘ఆగడు’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఈ పాట కూడా ఆ లిస్ట్‌లో జాయిన్ అయింది. ఇందులో విశేషమేంటంటే ఈ మూడింటికి తమన్ స్వరకర్త. ఇప్పటికే సర్కారువారి పాట చిత్రం నుంచి విడుదలైన ‘కళావతి’, ‘పెన్నీ’ పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ పాట కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్ బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

