Sarkaru Naukari | కుటుంబ నియంత్రణ కాన్సెప్ట్‌తో వస్తున్న సింగర్ సునీత కొడుకు.. ఆసక్తికరంగా ‘సర్కారు నౌకరి’ ట్రైలర్
Sarkaru Naukari Trailer | టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజును( Akash Goparaju) హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు నౌకరి’. ఆకాశ్‌కు జోడీగా భావన వళపండల్ నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Sarkaru Naukari Trailer | టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజును( Akash Goparaju) హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు నౌకరి’. ఆకాశ్‌కు జోడీగా భావన వళపండల్ నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
తెలంగాణలోని ఒక పల్లెటూరిలో ఆరోగ్య శాఖ ఉద్యోగిగా వస్తాడు గోపాల్ (ఆకాష్ గోపరాజు). అయితే గ్రామంలో నిరోధ్ (Condom) వాడకం గురించి అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం అతడిని నియమిస్తుంది. దీంతో కండోమ్స్ తీసుకుని వాటి వాడకం పట్ల గ్రామస్థులను అవగాహనా పరిచేందుకు పూనుకుంటాడు. కానీ అనూహ్యంగా అది అతని కాపురంలో చిచ్చు పెడుతుంది. ఇక ఆ తరువాత ఏ జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్ చూస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథతో ఈ సినిమా రానున్నట్లు అర్థమవుతుంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య, సాయిశ్రీనివాస్ వడ్లమాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
1996లో కొల్లాపూర్ వద్ద జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా.. ఈ సినిమాను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న థియేటర్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

