Sarkaru Naukari | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సింగర్ సునీత కుమారుడి ‘సర్కారు నౌకరి’.. ఎప్పుడంటే.?
Sarkaru Naukari | టాలీవుడ్లో ప్రస్తుతం వారసుల ఎంట్రీ కొనసాగుతుంది. ఇప్పటికే యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ (Roshan) ‘బబుల్గమ్’ (Bubblegum) అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే రోషన్‌తో పాటు టాలీవుడ్ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు.
Sarkaru Naukari | టాలీవుడ్లో ప్రస్తుతం వారసుల ఎంట్రీ కొనసాగుతుంది. ఇప్పటికే యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ (Roshan) ‘బబుల్గమ్’ (Bubblegum) అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే రోషన్‌తో పాటు టాలీవుడ్ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు నౌకరి’. ఆకాశ్‌కు జోడీగా భావన వళపండల్ నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమాను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న థియేటర్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సోషల్ డ్రామా కథతో ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించామని ఈ సినిమా దర్శకుడు గంగనమోని శేఖర్ వెల్లడించారు.
ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో బ్యానర్‌పై ‘శాంతి నివాసం’ సీరియల్‌తో దర్శకుడు రాజమౌళిని పరిచయం చేసిన తెలిసిందే. ఇప్పుడే ఇదే బ్యానర్ 25 వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రాఘవేంద్రరావు ‘సర్కారు నౌకరి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య, సాయిశ్రీనివాస్ వడ్లమాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

