Sarkaru Naukari | టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజును (Akash Goparaju) హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు నౌకరి’. ఆకాశ్‌కు జోడీగా భావన వళపండల్ నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌తో పాటు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రేపు ఈ సినిమా విడుదల కానుండగా ప్రెస్మీట్లో పాల్గొన్న ఆకాష్ గోపరాజు మీడియాతో ముచ్చటించాడు. ‘సర్కారు నౌకరి’ సినిమా నా కెరీర్‌కు మొదటి అడుగులాంటిది. కొత్త సంవత్సరం రోజే ఈ ముందుకు వస్తున్నాం. మా మొదటి అడుగులోనే ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమాలో నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. మంచి కంటెంట్ ఉన్న కథ. చక్కటి డ్రామా, కామెడీతో పాటు నేటి యువతకు సందేశం కూడా ఉంటుంది. మరోవైపు దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ.. ఇది కంటెంట్ ఓరియెంటెడ్‌గా సాగే సినిమా ఇది. 90స్ బ్యాక్‌డ్రాప్‌లోని రియల్ ఇన్సిడెంట్స్తో దీన్ని రూపొందించాను.. విలేజ్‌లో అనుబంధాలకు దర్పణంలా ఆకట్టుకుంటుందని తెలిపాడు.