నీ పసుపు పాదాలే తగిలి గడప పూసెనా
గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్నాడు. సినిమాపేరు ‘సర్కారు నౌకరి’. భావన కథానాయిక. ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. స్వీయ రచనతో సినిమాటోగ్రఫీని కూడా తానే అందిస్తూ గంగనమోని శేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్నాడు. సినిమాపేరు ‘సర్కారు నౌకరి’. భావన కథానాయిక. ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. స్వీయ రచనతో సినిమాటోగ్రఫీని కూడా తానే అందిస్తూ గంగనమోని శేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జనవరి 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘నీ పసుపు పాదాలే’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని శాండిల్య పీసపాటి స్వరపరిచి, కీర్తనతో కలిసి ఆలపించారు. ‘నీ పసుపు పాదాలే తగిలి గడప పూసెనా.. నీ ఎరుపు సిగ్గుల్లో ఎలిగి మెరిసెనా.. కంచు మెట్టె సప్పళ్లో ఇల్లే కళ్లు తెరిసి సూసెనా..’ అంటూ నవవధువు అత్తింట్లోకి అడుగుపెడుతున్న సందర్భంలో సాగే ఈ పాట కథలో భాగంగా ఉంటుందని, చిత్రీకరణ కూడా అద్భుతంగా కుదిరిందని దర్శకుడు తెలిపారు. తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు ఇందులో ఇతర పాత్రధారులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

