సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. భావన కథానాయిక. జనవరి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సామాజిక సమస్యలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
వినోదంతో పాటు చక్కటి సందేశం కూడా ఉంటుంది. నేటి యువతకు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అన్నారు. తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్.