Sarkaar 6 | ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా ప్రత్యేక కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లతో పాటు వినోదాత్మక గేమ్ షోలతో అభిమానులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న ‘సర్కార్ సీజన్ 6’ మంచి విజయాన్ని అందుకుని దూసుకుపోతోంది.ఈ గేమ్ షోకు సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తన కామెడీ టైమింగ్, చమత్కారాలతో ప్రేక్షకులను అలరిస్తూ షోను మరింత రంజుగా మార్చుతున్నారు. ఇదివరకు తొలి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా ఉండగా, నాలుగో సీజన్ నుంచి సుధీర్ ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత పాపులర్ అయింది.
‘ఈసారి అంతకు మించి’ అనే ట్యాగ్‌తో సాగుతున్న సీజన్ 6లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు పదో ఎపిసోడ్ కోసం విడుదలైన తాజా ప్రోమో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా నలుగురు ప్రముఖులు గెస్ట్లుగా హాజరుకానున్నారు. కమెడియన్ అలీ, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ, నటుడు శివాజీ ఈ ఎపిసోడ్లో పాల్గొననున్నారు. వీరితో పాటు స్పెషల్ గెస్ట్‌గా ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరయ్యారు. ఎప్పుడూ తనదైన స్టైల్, హాస్యభరిత ప్రసంగాలతో ఆకట్టుకునే మల్లారెడ్డి ఈసారి ‘సర్కార్’ స్టేజ్‌పై స్టెప్పులు వేస్తూ, సరదా వ్యాఖ్యలతో ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రోమోలో కనిపించిన హంగామా చూసి ఈ ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
ఈ క్రేజీ ఎపిసోడ్ మే 1న ఆహాలో ప్రసారం కానుంది. వినోదం, సరదా క్షణాలు పుష్కలంగా ఉండే ఈ ఎపిసోడ్‌ను ప్రేక్షకులు మిస్ కాకుండా చూడాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. మల్లా రెడ్డి ఎక్కడ ఉన్నా అక్కడ సందడి ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ షోలో ప్రేక్షకులని మరింత రంజిపచేయడం గ్యారెంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.