Saripodhaa Sanivaaram | సెన్సార్ కంప్లీట్ చేసుకున్న నాని ‘సరిపోదా శనివారం’.. రన్‌టైం ఎంతంటే.?
Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. తమిళ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. తమిళ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా మూవీ ప్రమోషన్స్ చేస్తుంది.
అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకున్నట్లు నాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా వదిలాడు. ‘సరిపోదా శనివారం’ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ U/A సర్టీఫికెట్ ఇచ్చింది. అలాగే 2 గంటల 35 నిమిషాలు రన్ టైం అని నాని చెప్పగా.. వెనక నుంచి ఎస్జే సూర్య వచ్చి ప్లస్ 15 మినిట్స్ అంటాడు. మొత్తం 2 గంటల 50 నిమిషాలు అంటే సుందరానికి కూడా ఇదే రన్ టైం కదా అంటూ ఎస్జే సూర్య అనగా.. అంటే కాదు.. ‘సరిపోదా శనివారం’ అంటూ నాని అనడం ఇది ఒక యాక్షన్ మూవీ అండ్ లవ్ స్టోరీ అంటూ వీడియోను వదిలారు.
🥶#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/lsfX1uQevb
— Nani (@NameisNani) August 23, 2024
యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ‘అంటే సుందరానికి’ (Ante Sundharaniki) సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎస్జే సూర్య ఓ క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

