Sardar Movie | ఏడాది పూర్తి చేసుకున్న ‘సర్దార్’ సినిమా.. సీక్వెల్ నుంచి సాలిడ్ అప్డేట్
Sardar Movie | తమిళం నుంచి ఎంట్రీ ఇచ్చిన తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు కార్తీ. ఇతడికి అటు తమిళంలో పాటు ఇటు తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. యుగానికి ఒక్కడు నుంచి మొన్నటి పొన్నియన్ సెల్వన్2 వరకు అన్ని సినిమాలు టాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి.
Sardar Movie | తమిళం నుంచి ఎంట్రీ ఇచ్చిన తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు కార్తీ. ఇతడికి అటు తమిళంలో పాటు ఇటు తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. యుగానికి ఒక్కడు నుంచి మొన్నటి పొన్నియన్ సెల్వన్2 వరకు అన్ని సినిమాలు టాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇక ఈ టాలెంటెడ్ హీరో పీఎస్ మిత్రన్ (PS Mithran) దర్శకత్వంలో నటించిన మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్ సర్దార్ (Sardar). గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కార్తీ-పీఎస్ మిత్రన్ టీం ఇప్పటికే ఈ సూపర్ హిట్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2)ను కూడా ప్రకటించింది.
అయితే సర్దార్ మూవీ విడుదలై సంవత్సరం అవుతున్న సందర్భంగా హీరో కార్తీ ఒక స్పెషల్ వీడియో పంచుకున్నాడు. ఈ వీడియోలో సర్దార్ మూవీ గురించి అభిమానులు రివ్యూ ఇస్తున్నట్లు ఉంది. కాగా ఈ వీడియోతో పాటు ఒక సాలిడ్ న్యూస్‌ను కార్తీ రివీల్ చేశాడు. సర్దార్ 2 త్వరలో మీ ముందుకు రాబోతున్నట్లు కార్తీ ట్విట్టర్లో రాసుకోచ్చాడు.
One year of Blockbuster #Sardar
Thank you my dear fans and audience for this great milestone. #Sardar2 loading soon.@Psmithran @lakku76 @Prince_Pictures pic.twitter.com/CDLDqXLHG0— Karthi (@Karthi_Offl) October 21, 2023
ఇదిలా ఉంటే సర్దార్ 2 సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. పార్ట్ 1కు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సీక్వెల్‌కు అతడి స్థానంలో మరో సంగీత దర్శకుడిని తీసుకొని.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. అంతేకాదు సీక్వెల్లో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ‘జపాన్’ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

