అమ్మాయి ఔనంది ఏకంగా..
ప్రియదర్శి, రూపా కొడువాయుర్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రతిష్టాత్మక శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రియదర్శి, రూపా కొడువాయుర్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రతిష్టాత్మక శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘సారంగో సారంగా.. అమ్మాయి ఔనంది ఏకంగా.. సారంగో సారంగా ఆనందాలందుకో అనేకంగా..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, వివేక్ సాగర్ స్వరపరిచారు. ఆర్మాన్ మాలిక్ ఆలపించారు. ‘హీరో ప్రేమకథకు మూలాధారం ఈ పాట. నిత్యజీవితంలో తనకు తారసపడేవారితో కథానాయకుడు సారంగపాణి తన ప్రేమని ఎలా ఆవిష్కరించాడో ఈ పాట చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్‌లోని విభిన్న ప్రదేశాల్లో ప్రియదర్శి, రూప కొడువాయూర్లపై వినూత్నంగా ఈ పాటను చిత్రీకరించాం. ఇందులో సరికొత్త ప్రియదర్శిని చూస్తారు’ అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు. నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

