ముంబై : ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఫుల్ ఎంజాయ్ చేసే బాలీవుడ్ భామల్లో సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ముందుంటుంది. యూరప్‌లో లావిష్ లొకేషన్లో వెకేషన్ అయినా, పటౌడీ హౌస్‌లో సింపుల్ గెట్ టూ గెదర్ అయినా ఫుడ్ అంటే తన ఇష్టాన్ని చాటుకునేందుకు ఆమె వెనుకాడదు.
ఫుడ్ లవర్ సారా మరోసారి నోరూరించే రుచులతో సోషల్ మీడియాను హోరెత్తించింది. ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో మొక్కజొన్న రోటీ, ఆవాకుతో చేసిన కర్రీని పోస్ట్ చేసింది. ఇంకా ప్లేట్లో గజర్ గోభి పికిల్ కూడా కనిపించింది.
స్టోరీలో సారా బటర్ చికెన్ ఫొటోను కూడా జోడించింది. ఈ ఫొటోను షేర్ చేస్తూ వింటర్ రుచి, సర్సన్ డా సాగ్, చిట్టా (బటర్ ఎమోజి),షుగర్, మొక్కజొన్న అని రాసుకొచ్చింది.
Read More :