Sapta sagaralu Dhaati Movie | ఎమోషనల్ రైడ్‌లా సప్త సాగరాలు దాటి టీజర్.. హార్డ్ హిట్టింగ్ లవ్‌స్టోరీలా ఉందే..!
Sapta sagaralu Dhaati Movie | టీజర్‌తోనే ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్‌స్టోరీ అని, ఎమోషనల్ కనెక్ట్ ఉందని అర్థమవుతుంది. మీరీ ముఖ్యంగా టీజర్లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ ఫీల్‌ను కలిగిస్తుంది.
Saptha sagaralu Dhaati Movie | ‘777చార్లీ’తో తెలుగులో ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకున్నాడు రక్షిత్ శెట్టి. అంతకుముందు ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు కానీ.. అది పెద్దగా ఆడలేదు. దాంతో చాలా మందికి రక్షిత్ పేరు పెద్దగా రిజస్టర్ కాలేదు. ఇక గతేడాది 777చార్లీ మాత్రం రక్షిత్ శెట్టికి తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు అదే నటుడి నుంచి వస్తున్న మరో ఆణిముత్యం సప్త సాగర దాచె ఎల్లో సైడ్-ఏ. ఈ నెల 1న రిలీజైన ఈ సినిమా కన్నడలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎగబడిపోతున్నారు. చాలా రోజుల తర్వాత ఓ హార్ట్ హిట్టింగ్ సినిమా చూశామని, గుండెల్ని పిండేసే సినిమా ఇదని రివ్యూలు ఇచ్చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను సప్త సాగారాలు దాటి పేరుతో సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు పీపుల్ మీడియా సంస్థ ఇటీవలే ప్రకటించింది. కాగా తాజాగా చిత్రబృందం సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది. ప్రియా అనే గాయని, మను అనే కారు డ్రైవర్ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ జీవితంలో గొప్పగా బతకాలన్న ఆశతో ఓ రాంగ్ స్టెప్ తీసుకుని చిక్కుల్లో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మను నా ఆశేంటో తెలుసా.. ఊర్లో సముద్రం ఉంది కదా.. ఆ సముద్రం ఒడ్డున నీతో జీవితాంతం నడుస్తూనే ఉండాలి. అలలొక్కక్కటి వచ్చి మన పాదాలను తడుపుతూ ఉంటే నేను నీ చేతులు గట్టిగా పట్టుకోవాలి. ఆ అలల శబ్దాన్ని అలా వింటుంటే గట్టిగా పాడాలనిపిస్తుంది మను. నీకెప్పుడూ చెప్పలేదు కానీ.. నీతో ఉన్నప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. నా సముద్రం నువ్వు అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన ప్రియా డైలాగ్ హార్ట్ హిట్టింగ్‌గా అనిపించింది.
టీజర్‌తోనే ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్‌స్టోరీ అని, ఎమోషనల్ కనెక్ట్ ఉందని అర్థమవుతుంది. మీరీ ముఖ్యంగా టీజర్లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఇక ఇది తొలిపార్టు మాత్రమే. ఈ సినిమాకు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ పార్ట్‌ను అక్టోబర్ 20న కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసే చాన్స్ ఉంది. ఇక ఈ హార్ట్ హిట్టింగ్ లవ్‌స్టోరీకి హేమంత్ దర్శకుడు. రక్షిత్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. ఈ సినిమాను రక్షిత్ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

