Mohabbat | మారుతి డైరెక్షన్లో వచ్చిన ప్రేమ కథా చిత్రమ్తోపాటు చిక్కిలిగింత, కాయ్ రాజా కాయ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెరిశాడు సంతోష్ కల్వచర్ల. ఈ యంగ్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘మొహబ్బత్’. సంతోష్ కల్వచర్ల, శ్రేయాసి సేన్ కాంబోలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మ్యాక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తుంది. బైక్‌పై వెళ్తున్న హీరోహీరోయిన్లు సూపర్ రొమాంటిక్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఈ మూవీలో అజయ్ ఘోష్, సాత్విక్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏబీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అప్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.
నిర్మాత అఫ్రోజ్ తొలి సినిమానే అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘మొహబ్బత్’ పాన్ ఇండియాగా స్థాయిలో రిలీజ్ చేసేలా సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. అన్ని రకాల ఎలిమెంట్స్‌తో సాగే ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ చిత్రంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.
Presenting the First Look of #Mohabbat ❤️🔥 pic.twitter.com/zgMfp2XGQB
— Telugu Film Producers Council (@tfpcin) June 5, 2026
Love is in the air ❤️
The journey of #Mohabbat begins today
Honored to have MLA #NaveenYadav garu and #ChinnaSrisailamYadav garu join the team for the grand launch ceremony
Clap by MLA @PingNaveenYadav
Camera Switch On by Producer #AfrozShaik#santoshkalwacherla #shreyasisen… pic.twitter.com/ajLpiYHFIN
— BA Raju’s Team (@baraju_SuperHit) June 5, 2026
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర