టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Soban), ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam). యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ అనుష్కాశెట్టి (Anushka Shetty) లాంఛ్ చేసింది.
నీ భోగమే భోగం రా.. ఉద్యోగం చేసే భార్య.. అవసరాలు తీర్చే మామా.. ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాలేమైనా ఉన్నాయా..? అంటూ హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెబుతూ సాగే డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. పెళ్లయిన తర్వాత అంతా సవ్యంగా నడుస్తుందనుకుంటున్న క్రమంలో.. శివ (హీరో)కు ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదేమో కానీ శృతి (హీరోయిన్) భర్తకు ఉద్యోగం ఉండాలని హీరోయిన్ అంటోంది. పెళ్లికి ముందు ఎప్పుడూ ఉద్యోగమే చేయని శివ పెళ్లయ్యాక శృతి కోసం ఉద్యోగంలో చేరాక ఏమైందనేది సస్పెన్స్ లో పెడుతూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
కళ్యాణం కమనీయం జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే సంతోష్ శోభన్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి శ్రావణ్ భరద్వాజ్ కంపోజిషన్‌లో విడుదలైన ఓ మనసా, హో ఎగిరే సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
కళ్యాణం కమనీయం ట్రైలర్..
A much relatable story of LOVE 💕 & MARRIAGE, #KalyanamKamaneeyam Trailer out now✨
▶https://t.co/XDo5qhF5mx#KalyanamKamaneeyamFromJan14 in Theatres 🥳@santoshsoban @priya_Bshankar @Dir_Anilkumar #KarthikGattamneni #ShravanBharadwaj @UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/eFE50C7ikH
— UV Creations (@UV_Creations) January 5, 2023
ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో
Watch & Enjoy Team #KalyanamKamaneeyam Funny Pre-Wedding Shoot & Hilarious Interview With #Sunaina
▶ https://t.co/y5ZQLs9x8d#KalyanamKamaneeyamFromJan14@santoshsoban @priya_Bshankar @Dir_Anilkumar #SravanBharadwaj @kk_lyricist #SatyaG@UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/N1d2BK1WdP
— UV Creations (@UV_Creations) January 2, 2023
హో ఎగిరే లిరికల్ సాంగ్.. వీడియో
ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్..