Heeramandi | సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండి’ ట్రైలర్ రిలీజ్
Heeramandi: The Diamond Bazaar | బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar). ఈ సిరీస్‌తోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగు పెడుతున్నారు భన్సాలీ.
Heeramandi: The Diamond Bazaar | బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar). ఈ సిరీస్‌తోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగు పెడుతున్నారు భన్సాలీ. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ మే 01 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో సిరీస్ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. ఇండిపెండెన్స్‌కు ముందు పాకిస్తాన్ లాహోర్‌లోని హీరామండి అనే ప్రాంతంలో వేశ్యలు ఉండగా.. ఈ ప్రాంతాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాలా) పరిపాలిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతాన్ని తమ గుప్పట్లోకి తెచ్చుకోవాలని బ్రిటీష్ వాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే మల్లికాజాన్ (మనీషా కొయిరాలా) ఏం చేసింది. అన్నింటిని ఎదుర్కొని హీరామండిలో చివరకు ఎవరు రాజ్యమేలుతారు? అనే స్టోరీతో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. ఈ చిత్రానికి భన్సాలీతో పాటు విభు పూరి, మితాక్షర కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

