Sania-Shoaib | సానియా – షోయబ్ విడాకులు..! సంచలన విషయాలు వెలుగులోకి..!
Sania-Shoaib | పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, నటి సనా జావేద్ పెళ్లి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. భారత టెన్నిస్ స్టార్ సానియా, షోయబ్ విభేదాలతో కొద్ది నెలల కిందటే ఇద్దరు విడిపోయారు. ఈ జంట విడిపోవడంతో అందరినీ ఆశ్చర్చానికి గురి చేసింది. విడిపోవడానికి కారణం ఏంటన్నది తెలియరాలేదు.
Sania-Shoaib | పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, నటి సనా జావేద్ పెళ్లి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. భారత టెన్నిస్ స్టార్ సానియా, షోయబ్ విభేదాలతో కొద్ది నెలల కిందటే ఇద్దరు విడిపోయారు. ఈ జంట విడిపోవడంతో అందరినీ ఆశ్చర్చానికి గురి చేసింది. విడిపోవడానికి కారణం ఏంటన్నది తెలియరాలేదు. ఇద్దరి మధ్య ఏం జరిగిందనేదానిపై ఎవరూ నోరువిప్పలేదు. అయితే సానియా మీర్జాను షోయబ్ మాలిక్ మోసం చేసినట్లు పాక్ మీడియా కోడై కూసింది. మాలిక్ వివాహేతర సంబంధాలే ఇద్దరి వివాహిక జీవితానికి ఎండ్‌కార్డ్ పడిందని పాక్‌కు చెందిన ఓ మీడియా నివేదిక పేర్కొంది.
సనా జావేద్, షోయబ్ మాలిక్ గత మూడేళ్లుగా రహస్యంగా కలుకుంటుంన్నారని.. అయితే అప్పటికే సనా జావేద్‌కు ఉమైర్ జస్వాల్‌తో పెళ్లయ్యిందని నివేదిక తెలిపింది. ‘జీతో పాకిస్థాన్’ షోలో షోయబ్ సనాను కలువగా.. ఆ తర్వాత ఇద్దరూ క్రమం తప్పకుండా కలుసుకోవడం మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ ఏదైనా షోకు వచ్చే ముందు సనా జావేద్‌ను గెస్ట్‌గా పిలిస్తే వస్తానని కండిషన్ పెట్టేవాడని నివేదిక పేర్కొంది. పెళ్లి కొద్దిరోజుల ముందే సనా విడాకుల విషయం ఉమైర్ జస్వాల్‌కు చెప్పిందని, ఈ నిర్ణయంతో అతను షాక్‌కు గురయ్యారని మీడియా సంస్థ నివేదిక వెల్లడించింది.
ఇక సానియా-షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారం శాంతియుతంగా ముగిసిందని.. విడిపోయిన విషయం సైతం ఎవరికీ తెలియలేదని.. ఇదంతా చాలా సైలెంట్‌గా జరిగిందని చెప్పింది. విడిపోయే విషయంలో మాలిక్ కుటుంబమంతా సానియాకే మద్దతు తెలిపిందని నివేదిక పేర్కొంది. షోయబ్-సనా జావేద్ పెళ్లికి కుటుంబీకులు హాజరైనట్లు కూడా తెలియదని తెలిపింది. ఇక సానియా, షోయబ్‌ల వివాహం 2010లో జరిగింది. మాలిక్‌కు సానియా రెండో భార్య కాగా.. అంతకు ముందు హైదరాబాద్‌కే చెందిన ఆయేషా సిద్ధిఖీని సైతం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. షోయబ్‌కు సనా మూడో భార్య కాగా.. ఇప్పటికే సానియా – షోయబ్‌కు కొడుకు ఇజాన్ ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

