Sanya Malhotra | నా యాటిట్యూడ్ అలాగే ఉంటుంది: సానియా మల్హోత్ర
గతేడాది నేను నటించిన 5 సినిమాలు విడుదల అయ్యాయి. ఫలితాలు ఎలా ఉన్నా.. నటిగా మాత్రం నాకు మంచి గుర్తింపు లభించింది.
ఇప్పుడు బాలీవుడ్లో బిజీగా ఉన్న నటీమణుల్లో ఒకరు సానియా మల్హోత్ర. చిన్నాపెద్దా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నది. ‘సామ్ బహదూర్’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా ఇలా డిఫరెంట్ జానర్స్ ఎంచుకుంటూ తన నటనా ప్రయాణాన్ని పక్కాగా కొనసాగిస్తున్న సానియా కబుర్లు ఆమె మాటల్లోనే..
Sanya Malhotra | గతేడాది నేను నటించిన 5 సినిమాలు విడుదల అయ్యాయి. ఫలితాలు ఎలా ఉన్నా.. నటిగా మాత్రం నాకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘సామ్ బహదూర్’ సినిమాలో నా వయసుకు మించిన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. పరిణతితో నటించాల్సిన రోల్ అది. ఆ క్యారెక్టర్ కోసం చాలా హోమ్‌వర్క్ చేశాను. అందులో మానెక్ షా పాత్ర పోషించిన విక్కీ కౌశల్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సినిమా చూశాక ఆనందంతో కన్నీళ్లు ఆగలేదంటే నమ్మండి. అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో నటించాలని అందరి డ్రీమ్. కెరీర్ తొలినాళ్లలోనే ‘జవాన్’ సినిమాతో నా కల నెరవేరింది. చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూ పెరిగాను. నేను ఢిల్లీలోనే ఉండేదాన్ని! సినిమాల్లోకి రాకముందు షారుఖ్ కూడా ఢిల్లీలోనే ఉండేవారు. ఢిల్లీ అమ్మాయి అని ‘జవాన్’ షూటింగ్ టైమ్‌లో ఆయన నన్ను ఎంతగానో ఆదరించారు. కారులో తీసుకెళ్లి తన స్కూల్, కాలేజ్ అన్నీ చూపించారు కూడా! జవాన్‌లో ఆయనతో కలిసి పనిచేసిన ఆరుగురం ‘గుడ్ టు గో, చీఫ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అందరం అప్పుడప్పుడూ గ్రూప్ కాల్ చేసుకుంటాం. ఆయన మాతో చాలా సరదాగా మాట్లాడతారు. ‘నేను బిగ్‌స్టార్’ని అనే అహం ఆయనలో ఎప్పుడూ కనిపించదు.
మనిషికి ఓపిక చాలా అవసరం. కష్టపడితే సరిపోదు. నిదానమే ప్రధానం అంటారు కదా! నా యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. అన్నీ మీదేసుకోవడం నాకు నచ్చదు. నా అవసరం ఉందనుకుంటే మాత్రం తక్షణం స్పందిస్తా! కెరీర్ విషయంలో కూడా తెగ హైరానా పడిపోను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టిసారిస్తాను. అందులో మనం విజయవంతం అయితే.. వద్దన్నా అవకాశాలు పలకరిస్తూనే ఉంటాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

