సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మసూద’. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హారర్ డ్రామా కథాంశమిది. మంచి హారర్ డ్రామా చూసి చాలా కాలమైంది. ఈ తరహా కథల్లో విభిన్నంగా నిలిచే చిత్రమవుతుంది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్యప్రకాష్, సూర్యారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా, రచన-దర్శకత్వం: సాయికిరణ్.