Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Sampoornesh Babu | బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా నటించిన కామెడీ చిత్రం ‘కొబ్బరి మట్ట’ మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది. పేరడీ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను థియేటర్లలో తిరిగి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. తాజాగా రీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించింది.
Sampoornesh Babu | బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా నటించిన కామెడీ చిత్రం ‘కొబ్బరి మట్ట’ మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది. పేరడీ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను థియేటర్లలో తిరిగి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. తాజాగా రీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించింది. 2019 ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైన ‘కొబ్బరి మట్ట’ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను నవంబర్ 14న మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ వార్తతో సంపూర్ణేష్ బాబు అభిమానులు, కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
అమృత ప్రొడక్షన్స్ పతాకంపై సాయి రాజేష్ నీలం ఈ చిత్రాన్ని నిర్మించారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. గతంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘హృదయ కాలేయం’ విజయవంతం కావడంతో, ఆ తర్వాత సాయి రాజేష్ నిర్మాతగా ‘కొబ్బరి మట్ట’ను రూపొందించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. పాపారాయుడు, పెద్దరాయుడు, ఆండ్రాయుడు పాత్రలతో తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఆయన నటన, హాస్య సన్నివేశాలు, డ్యాన్సులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంపూర్ణేష్ బాబు సరసన ఇషికా సింగ్, గాయత్రి గుప్తా, షకీలా కథానాయికలుగా నటించగా, కత్తి మహేష్ కీలక పాత్ర పోషించారు. కమ్రాన్ సంగీతం అందించారు.
‘కొబ్బరి మట్ట’ కథ పెద్దరాయుడు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు భార్యలు, నలుగురు తమ్ముళ్లు, ఎంతోమంది చెల్లెళ్లతో కూడిన పెద్ద ఉమ్మడి కుటుంబానికి పెద్దదిక్కుగా ఆయన ఉంటారు. కుటుంబ సభ్యులకే కాకుండా గ్రామ ప్రజలకు కూడా సహాయం చేస్తూ మంచి మనిషిగా పేరు సంపాదిస్తారు. అయితే, పెద్దరాయుడి పోలికలతో ఉన్న ఆండ్రాయుడు వచ్చి తాను కూడా కుటుంబ వారసుడినని, ఆస్తిలో తనకు వాటా కావాలని డిమాండ్ చేయడంతో కథలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత జరిగే సంఘటనలు, హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇటీవల నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో సంపూర్ణేష్ బాబు బిర్యానీ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను మరోసారి పూర్తి స్థాయి కామెడీ పాత్రల్లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 14న ‘కొబ్బరి మట్ట’ రీ రిలీజ్ కానుండటంతో థియేటర్లలో మళ్లీ నవ్వుల సందడి నెలకొంటుందేమో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

