అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు తరచు తన ఫొటో షూట్స్, ఇతర వ్యవహారాలకి సంబంధించిన ఫొటోలు,వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. సమంత ఇటీవల శాకుంతలం చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం కాతు వాకుల్ రెండు కాదల్ చిత్రంలో నటిస్తుంది.
సమంత, విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుండగా, తాజాగా ఈ సినిమా నుండి టు టు టు మ్యూజికల్ వీడియో సోషల్ మీడియా విడుదలైంది. ఇంది యూ ట్యూబ్ లో సైతం ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ పాట ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ను ఆకట్టుకుంది. ఈ పాట తనకు బాగా నచ్చింది అని, బాగా చేశారు అంటూ చెప్పుకొచ్చారు.
విఘ్నేష్ శివన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్ తెలిపింది. ఈ క్రమంలో సమంత.. ప్రియాంక ట్వీట్‌పై స్పదించింది. మీ వ్యాఖ్యలు మా టీమ్‌కి ఎంకరేంజ్మెంట్గాఉందని అన్నారు. థ్యాంక్యూ ప్రియాంక అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది సమంత. ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్, నయన తార మరియు లలిత్ కుమార్ లు నిర్మించడం జరిగింది.