అందరూ సమ్మతమే అంటారు
“సమ్మతమే’ ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ అయినా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. థియేటర్లలో సినిమా చూసి ఆనందించండి. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం హైదరాబాద్‌లో ‘సమ్మతమే’ చిత్ర ట్రైలర్‌ను ఆయన ఆవిష్కరించారు.
“సమ్మతమే’ ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ అయినా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. థియేటర్లలో సినిమా చూసి ఆనందించండి. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం హైదరాబాద్‌లో ‘సమ్మతమే’ చిత్ర ట్రైలర్‌ను ఆయన ఆవిష్కరించారు. కిరణ్ అబ్బవరం, చాందినిచౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. కంకణాల ప్రవీణ నిర్మాత. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన వారందరూ సమ్మతమే అంటారు. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరిని మెప్పిస్తుంది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘మాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని గొల్లపల్లి అనే చిన్న గ్రామం. మాలాంటి సినీ ఔత్సాహికులకు మద్దతునిస్తున్న మంత్రి కేటీఆర్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గీతా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు. ‘కేటీఆర్‌గారు ట్రైలర్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, మాలాంటి కొత్తవాళ్లు సినిమాల్లో రాణించాలని కేటీఆర్‌గారు మాట్లాడటం మాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా చూసినవారందరూ అంతా సమ్మతమే అని ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ సినిమా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నాం’ అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

