Samantha | సమంత ‘యశోదా’ విడుదల వాయిదా పడనుందా?
Samantha’s Yashoda Movie | వినూత్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈమె నటించిన ‘కతు వాకుల రెండు కాదల్’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మూడు సినిమాలలో నటిస్తుంది. అందులో ‘యశోద’ ఒకటి. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై మొదట్లో అంతగా అంచనాలు లేవు. కానీ ఇటీవలే విడుదలైన గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు.
అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదా పడనుందట. షూటింగ్ కారణంగా సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సై-ఫై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దీనితో పాటుగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషిలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

