Shaakunthalam Movie gets Post poned | ఒకప్పుడు ముందుగా నిర్ణయించిన తేదీకే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రోజుల్లో సినిమాలు ఒక రిలీజ్ డేట్‌కు కట్టుబడి ఉండడం చాలా కష్టం అయిపోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమానే నాలుగైదు సార్లు పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసిన అంతే హైప్ ఉంటుంది. కానీ మిగిలిన సినిమాలు అలా కాదు. మొదట అనుకున్న తేదికి కట్టుబడి ఉండకపోతే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. రేపో మాపో విడుదలవుతుందని అనుకునే సమయంలో పోస్ట్ పోన్ అంటూ మేకర్స్ అందరికి షాక్ ఇస్తుంటారు. శాకుంతలం సినిమా కూడా ప్రస్తుతం అలాంటి షాక్‌నే ఇచ్చింది.
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ పలుమార్లు విడుదల తేదిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇక మహాశివరాత్రికి కచ్చితంగా వస్తుందంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తీరా చూస్తే ఈ సారి కూడా సమంత ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఏవో కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు, త్వరలోనే సినిమా డేట్‌ను ప్రకటిస్తున్నట్లు సామ్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. నిజానికి ఈ సినిమాపై ఇప్పుడు కూడా పెద్ద క్రేజ్ ఏమి లేదు. కానీ పోటీగా అంచనాల్లేని సినిమాలు ఉండటం. పైగా మహాశివరాత్రి కావడంతో కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చినా ఈజీగా హిట్ స్టేటస్ పొందచ్చు. కానీ ఇలా రిలీజ్ డేట్లను తరచూ చేంజ్ సినిమాపై ఉన్న కాస్త ఇంట్రెస్ట్‌ను కూడా పోయేలా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో డేట్స్ బుక్కయిపోయాయి. మళ్ళీ ఈ సినిమాకు సమ్మరే గతి.
మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలకపాత్ర పోషిస్తు్న్న ఈ సినిమాను దిల్‌రాజు సమర్పణలో గుణ టీంవర్క్స్ బ్యానర్‌పై నీలిమాగుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రుద్రమదేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించాడు.
The theatrical release of #Shaakuntalam stands postponed.
The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/63GIFbK4CF
— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2023