సమంత ప్రధాన పాత్ర పోషించి, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి నిర్మించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీ అయింది.
ప్రేక్షకులు పెట్టే డబ్బుకీ, వెచ్చించే సమయానికీ న్యాయం చేసే సినిమా ఇదని సమంత హామీ ఇస్తున్నారు. గౌతమి, శ్రీముఖి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్, కెమెరా: ఓం ప్రకాశ్, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాణం: ట్రలాలా మూవింగ్ పిక్చర్స్.